ఈ రాశి వారికి కావలసినంత ధనం చేతికందుతుంది

270

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : శనివారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : సప్తమి (నిన్న తెల్లవారుజాము 3 గం॥ 54 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 41 ని॥ వరకు)
నక్షత్రం : అశ్విని (నిన్న మధ్యాహ్నం 2 గం॥ 7 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 40 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : బవ
వర్జ్యం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 14 ని॥ నుంచి 2 గం॥ 0 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు ఉదయం 8 గం॥ 42 ని॥ నుంచి 10 గం॥ 28 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు ఉదయం 7 గం॥ 37 ని॥ నుంచి 8 గం॥ 28 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 9 గం॥ 7 ని॥ నుంచి 10 గం॥ 43 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 54 ని॥ నుంచి ఉదయం 7 గం॥ 30 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి 3 గం॥ 34 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : మేషము

మేష రాశి : ఈరోజు పనులలో కొన్ని అడ్డంకులు. కొన్ని సుఖాలను వదులుకోవాల్సి వస్తుంది. భగవంతుడు ఏది ఇస్తే దాన్ని అందుకోండి. ఆదాయం బాగుంది పాత బకాయిలు వసూలవుతాయి. అనవసరపు ఖర్చులను నివారించండి. ఇతరుల గురించి ఆలోచించకండి సరైన నిర్ణయాలు ధైర్యంగా తీసుకోండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. కొంతమంది ఉద్యోగులకు జీతాలు పెరుగుదల వారికి ఎంతో ఆనందం. ఇతరులతో పరుషంగా మాట్లాడకండి. దానివలన లేనిపోని చికాకులు. బయట తిండి వలన అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త ఆఫీసు పనులతో ఒత్తిడి వలన మీతో గడప లేకపోవడం మీకు మానసిక అశాంతి.

వృషభ రాశి : పట్టుదలతో ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయండి. వ్యాపారులకు లాభాలు వ్యాపార విస్తరణ కోసం నూతన పెడతారు. నిరుద్యోగులకు శుభవార్త. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి ఇంట్లో పెద్ద వారి సహాయ సహకారాలు లభిస్తాయి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మిధున రాశి : ఆత్మవిశ్వాసం తో అనుకున్న కార్యాలను సులభంగా సాధిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. వ్యాపారులు తమ ప్రత్యర్థి వ్యాపారులతో జాగ్రత్త వహించండి. ఆఫీసు పనులపై శ్రద్ధ పెట్టి సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి. పనులు పెండింగ్ పెట్టకండి పై అధికారులు గమనిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి వారు హర్ట్ అవుతారు. ఇంట్లో పెద్ద వారి సహాయ సహకారాలు లభిస్తాయి. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరే అవకాశం. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

కర్కాటక రాశి : ఎలక్ట్రానిక్ మీడియా వారికి మంచి అవకాశాలు. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. ఒక శుభవార్త వలన ఇంటిలో ఆహ్లాదకర వాతావరణం. వ్యాపారంలో తమ నూతన పెట్టుబడులపై తొందరపడకండి. ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. నిరాశ గందరగోళం వదిలిపెట్టండి సహనంతో ఆలోచించండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కావాల్సినంత ధనం చేతికందుతుంది పొదుపు చేస్తారు సీజన్ మార్పు వలన దగ్గు జలుబు. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

సింహరాశి : కంగారు పడకండి అన్ని పనులు సకాలంలో జరుగుతాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులపై ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందరపడకండి. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండి చదువు మీద శ్రద్ధ పెట్టి మరింత కష్టపడండి. తోటి ఉద్యోగులతో వాదోపవాదాలకు దిగకండి. ఆదాయం పర్వాలేదు అనుకోని ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఇతరులను తప్పు పట్టడం విమర్శించడం వలన బంధువులతో వైరం రావచ్చు జాగ్రత్త వహించండి. అధిక శ్రమ వలన తలనొప్పి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

కన్యారాశి : ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. నిరాశావాదం వదిలిపెట్టండి తోటి ఉద్యోగులతో హస్క్ కొట్టడం వలన సమయం వృధా. మీ వ్యక్తిగత విషయాల గురించి వారితో మాట్లాడకండి దానివలన లేనిపోని ఇబ్బందులు. వ్యాపారులు ప్రభుత్వ విధానాలను కరెక్ట్ గా పాటించడానికి ప్రయత్నించండి. అధిక సామర్థ్యం తో ధైర్యంతో ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

తులారాశి : ఈరోజు నల్లేరు మీద నడక. అనుకున్న కార్యాలను అతి సులభంగా సాధిస్తారు. నూతన అవకాశాలు. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఆదాయం పరవాలేదు దుబారా ఖర్చులను నివారించండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. మీ సామర్థ్యం మీద పని నిబద్ధత మీద అందరి ప్రశంసలు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశి స్త్రీల కి మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

వృశ్చిక రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు నూతన స్నేహితుల పరిచయం. శారీరక మానసిక ఆరోగ్యం కొరకు యోగా మెడిటేషన్ చేయండి. ఆఫీసులో తోటి ఉద్యోగుల, పై అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రారంభిస్తారు కొత్తగా భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభిద్దాం అనుకునే వారికి మంచి అవకాశం. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుంది. ఈరోజు ఆఫీసులో పూర్తిగా బిజీ. పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం పరవాలేదు అనవసరపు ఖర్చులను నివారించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మరిచిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజును గడపండి.

ధనుస్సు రాశి : ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలు సాధిస్తారు. ఏమి జరిగినా అంతా మన మంచికే అనే దృక్పథంతో ఉండండి. మీ పిల్లల ప్రగతి మీకు ఎంతో గర్వకారణం. వారితో గడపడం వల్ల మీకెంతో ఎనర్జీ. ఆఫీసులో పనులను సకాలంలో చకచకా పూర్తి చేస్తారు. అందరి ప్రశంసలు. కుటుంబ సభ్యులతో గడపటం వల్ల మీకు ఎంతో ఎనర్జీ. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదాయం పర్వాలేదు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఇది ఒక ఆనందకరమైన రోజు.

మకర రాశి : ఆశావహ దృక్పథంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. దైవప్రార్థన వలన మానసిక బలం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. దేవుడి మీద భారం వేసి ఉపయోగం లేదు. ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నిస్తున్న నిరుద్యోగులకు వారి శ్రమకు తగిన ఫలితం. సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వారి ఆఫీసులో శుభవార్తలు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ తాపత్రయం వలన నూతన పరిచయాలు. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో పరుషంగా మాట్లాడకండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు గడపండి.

కుంభరాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకోండి. ఆఫీసులో పనులను సకాలంలో పూర్తి చేస్తారు మీ పని నిబద్ధత పై అందరి ప్రశంసలు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు దీర్ఘకాలంలో లాభాలను తెస్తాయి. కావలసినంత ధనం చేతికందుతుంది. పొదుపు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

మీన రాశి : ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక మార్గం మీద ఆసక్తి కనబరుస్తారు. దైవ ప్రార్ధన వలన మానసిక బలం. ఆఫీసు పనులలో అదనపు బాధ్యతల వలన అధిక శ్రమ. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయ వ్యవహారాలు పూర్తిగా మెరుగుపడతాయి. సరైన ప్రణాళికతో ముఖ్య అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక తీపి గుర్తు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..