మహానటికి ‘సర్కార్ వారి పాట’ ఆహ్వానం..

59

దిశ, వెబ్‌డెస్క్: ఒక్క సినిమా చాలు నటుడి సత్తా తెలిపేందుకు.. ఒక్క మంచి సన్నివేశం చాలు నటుడిగా ప్రూవ్ చేసుకునేందుకు.. అలాంటి ఒక్క సినిమా ‘మహానటి’. అయితే, ఇప్పుడున్న తరంలో అలాంటి ఒకే ఒక్క నటి.. మన తరం మహానటి కీర్తి సురేష్. ఈ సినిమాలో తను చేసిన ప్రతీ సన్నివేశం అద్భుతం. అలనాటి సావిత్రిని తెరపై ఆవిష్కరించి పాత్రకు జీవం పోయడం మాత్రమే కాదు, ఆ సావిత్రిని మరిపించి.. మహానటి అంటే కీర్తి సురేష్ అనేలా చేసింది.

వయసు చిన్నదే అయినా నటనలో మేటి అయిన కీర్తి.. ‘పెంగ్విన్’ సినిమాలో చేసిన తల్లి పాత్ర అద్భుతం. కిడ్నాప్ అయిన బిడ్డ కోసం పాకులాడే తల్లిగా.. తనను కాపాడుకునేందుకు అనుక్షణం పరితపించే అమ్మగా.. చేతిలో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డతో ఉండే క్యారెక్టర్‌ను సహజత్వానికి దగ్గరగా, అవలీలగా పోషించి ప్రశంసలు అందుకుంది. అలాంటి మహానటి కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా గొప్ప సినిమాలు చేయాలని విష్ చేశారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలో ప్రస్తుతం తను తెలుగులో చేస్తున్న ‘మిస్ ఇండియా, రంగ్ దే’ సినిమాల నుంచి స్పెషల్ పోస్ట్‌లు రిలీజ్ చేసి విషెస్ అందించాయి మూవీ యూనిట్స్.

కాగా, సూపర్ స్టార్ మహేశ్ ‘సర్కార్ వారి పాట’ సినిమాలో కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది మూవీ యూనిట్. ఈ సందర్భంగా సర్కార్ వారి పాట ప్రాజెక్ట్‌కు వెల్‌కమ్ చెప్పిన మహేష్.. ఈ చిత్రం కీర్తికి మరో మోస్ట్ మెమొరబుల్ సినిమా అవుతుందని చెప్పాడు.