పేదలకు రూ.10కి లుంగీ, చీరలు

26

రాంచీ: దారిద్ర్య రేఖకు దిగువన ఉండే కుటుంబాలకు రూ. 10కి లుంగీ/దోతి, చీరలను ఏడాదికి రెండు సార్లు అందించనున్నట్టు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. క్యాబినెట్ సమావేశానంతరం సీఎం ఈ ప్రకటన చేశారు. ప్రతి ఆరునెలలకు ఒకసారి ఈ వస్త్రాలను అందించనున్నట్టు సీఎం తెలిపారు. రేషన్ కార్డు, అంత్యోదయ కార్డులున్నవారు లబ్దిదారులని వివరించారు. వీటిని సబ్సిడీ ధరల కింద రూ. 10కి లుంగి/దోతి, రూ. 10కి చీరను అందిస్తారని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒకసారి వీటి అందజేత ఉంటుందని పేర్కొన్నారు.