మళ్లీ ఈ అధ్యయనాలు ఎందుకో? : సంపత్

by  |
మళ్లీ ఈ అధ్యయనాలు ఎందుకో? : సంపత్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగవర్గాలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కమిటీలు, అధ్యయనాలతో కాలయాపన చేయరాదని తెలంగాణ ఎంప్లాయిస్​ అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు చిలగాని సంపత్​ కుమారస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం సీఎం కేసీఆర్​ ఉద్యోగులకు వేతన సవరణ, ఇతర అంశాలపై ప్రకటన చేసిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేతన సవరణ గురించే వేతన సవరణ కమిషన్​ వేశారని, రెండున్నరేండ్లు దాటినా పీఆర్సీ నివేదిక సబ్మిట్​ చేయలేదని విమర్శించారు. కనీసం సబ్మిట్​ చేయని రిపోర్టుపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమిటీ వేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో తెలియడం లేదన్నారు.

అదేవిధంగా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతామని నిర్ధిష్టంగా చెబుతూ మేనిఫెస్టోలో పెట్టారని, అలాంటి అంశంపై మళ్లీ చర్చ ఎందుకు, అధ్యయనం ఎందుకని సంపత్​ కుమారస్వామి ప్రశ్నించారు. ఈ అధ్యయనాలు, చర్యలు పూర్తి అయ్యేలోగా మళ్లీ కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన కోడ్​, ఆ తర్వాత పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ చివరకు నాగార్జున సాగర్​ ఉప ఎన్నికల కోడ్​ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే నివేదికలు, అంశాలన్నీ తెలిసి ఉన్నారని, వెంటనే 65 శాతం ఫిట్​మెంట్​తో పీఆర్సీ ప్రకటించాలని, ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు భేషరత్​గా పెంచాలని డిమాండ్​ చేశారు. అదేవిధంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్​ పథకాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని టీఈఏ అధ్యక్షుడు సంపత్​ కుమారస్వామి డిమాండ్​ చేశారు.

Next Story

Most Viewed