కరోనా దెబ్బకు స్వయం ఉపాధి ఎంచుకుంటున్న వేతన కార్మికులు!

by  |
కరోనా దెబ్బకు స్వయం ఉపాధి ఎంచుకుంటున్న వేతన కార్మికులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి కారణంగా దేశంలోని అనధికార ఉపాధి పెరుగుదల అధికంగా ఉందని ఓ నివేదిక తెలిపింది. కరోనాతో దెబ్బతిన్న వేతన కార్మికులు ఇప్పుడు సొంత ఉపాధి, రోజుకూలీ వంటి ఉపాధి వైపునకు మొగ్గు చూపుతున్నారని అజీమ్ ప్రేమ్‌జీ నివేదిక వెల్లడించింది. వీరందరూ వ్యవసాయ, వాణిజ్య రంగాల్లో పనులు వెతుక్కునేందుకు ఆసక్తి చూపిస్తుండగా, ఎక్కువమంది ఉద్యోగులను కోల్పోతున్న రంగాల్లో విద్య, ఆరోగ్య, వృత్తిపరమైన సేవల రంగాలు ముందున్నాయి.

2020లో విధించిన లాక్‌డౌన్ దెబ్బకు కార్మికులు అనధికార ఉపాధి వైపునకు వెళ్లారని అజీమ్ ప్రేమ్‌జీ ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా-2021: వన్ ఇయర్ ఆఫ్ కొవిడ్-19’ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం.. వేతనకార్మికుల్లో సగం మంది అనధికార రంగంలోకి ప్రవేశించారని, వాటిలో స్వయం ఉపాధి ఎంచుకున్న వారు 30 శాతం మంది, సాధారణ వేతన పనిని వెతుకున్న వారు 10 శాతం, అనధికార వేతనం అందుకునే పనుల్లోకి 9 శాతం మంది వెళ్లినట్టు నివేదిక వివరించింది. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, వృత్తిపరమైన సేవల రంగాల్లో కార్మికులు అత్యధికంగా అనధికార ఉపాధిని ఎంచుకున్నట్టు స్పష్టమైంది. ఇందులో విద్యా రంగం నుంచి 18 శాతం మంది వ్యవసాయం వైపు మళ్లారని నివేదిక అభిప్రాయపడింది.



Next Story

Most Viewed