సజ్జనార్ కీలక నిర్ణయం.. TSRTCలో మరో మార్పు.. ప్రజల హర్షం.!

441
Sajjanar-125

దిశ, డైనమిక్ బ్యూరో : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకెళ్లేందుకు డైనమిక్ పోలీసు ఆఫీసర్ వీసీ సజ్జనార్ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా
ప్రయాణికులను ఆకర్షిస్తూ ఆర్టీసీని ఆదరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ఫలితంగా ఆర్టీసీ ఆదాయం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాహ వేడుకల కోసం బస్సులను బుక్ చేసుకునే వారికి ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే బస్సులను బుక్ చేసుకునే సదుపాయం తీసుకొచ్చింది. దీని కోసం సంబంధిత డిపో మేనేజర్లను సంప్రదించాలని సజ్జనార్ సూచించారు. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..