సరికొత్త జోనర్‌లో తేజ్

191

మెగా ఫ్యామిలీ నుంచి, మెగాస్టార్ పోలికలతో ఇండస్ట్రీకి వచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ మొదట్లో హిట్స్ కొట్టిన ఈ సుప్రీం హీరో ఆ తర్వాత డీలా పడ్డాడు. వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ఎట్టకేలకు చిత్రలహరి మూవీ‌తో హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఆ తర్వాత వెంటనే ‘ప్రతి రోజూ పండగే’ చిత్రంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే సోలో బతుకే సో బెటర్ చిత్రం చేస్తున్న తేజ్..దేవ కట్టా డైరెక్షన్‌లో మరో మూవీ చేయబోతున్నారు.

తేజ్ తాజాగా మరో చిత్రాన్ని ప్రకటించాడు. డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి కథ అందిస్తుండగా.. శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నారు. ఇది తేజ్‌కు 15వ చిత్రం కాగా, మిస్టికల్ థ్రిల్లర్‌గా జోనర్‌లో ఉండబోతుంది. సరికొత్త జోనర్‌తో కూడిన సినిమాను చేస్తున్నందుకు తేజ్ ఆనందం వ్యక్తం చేయగా..సినిమాను కార్తీక్ దండు డైరెక్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..