ప్రపంచంతో తెలంగాణ విద్యార్థులు పోటీ: సబిత

by  |
ప్రపంచంతో తెలంగాణ విద్యార్థులు పోటీ: సబిత
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం ధారూర్ మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.30 లక్షల రూపాయలతో నిర్మించిన అదనపు తరగతి గదులను, రూ.9 లక్షలతో నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే ఆనంద్, విద్య మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 4 వేల కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. ప్రయివేటుకు ధీటుగా అత్యాధునికంగా మార్చటానికి కృషి చేస్తానన్నారు. సరస్వతి నిలయంగా తెలంగాణ రాష్ట్రం అవుతుందన్నారు. ప్రపంచంతో మన తెలంగాణ విద్యార్థులు పోటీ పడేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.



Next Story