2023లో టూరిస్ట్ స్పేస్ వాక్.. రష్యా ప్లానింగ్!

by  |
2023లో టూరిస్ట్ స్పేస్ వాక్.. రష్యా ప్లానింగ్!
X

రష్యాకు చెందిన ‘ఎనర్జియా స్పేస్ కార్పొరేషన్’ వారు గురువారం ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటన విన్న అంతరిక్ష ఔత్సాహికులందరూ తమ డబ్బులు సిద్ధం చేసుకుంటున్నారు. 2023 నాటికి అంతరిక్ష యాత్రికులకు ‘స్పేస్ వాక్’ అవకాశాన్ని కల్పిస్తామని చెప్పడమే ఆ ప్రకటన సారాంశం. కాగా ఇందుకోసం ‘స్పేస్ అడ్వెంచర్స్’ అనే అమెరికా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు ఎనర్జియా తెలిపింది. ఇందులో భాగంగా ఇద్దరు యాత్రికులను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకుని వెళ్లేందుకు ఇరు సంస్థలు అంగీకరించినట్లు తెలుస్తోంది. వారిలో ఒక యాత్రికునికి, అప్పటికే ఐఎస్ఎస్‌లో ఉన్న వ్యోమగామితో కలిసి స్పేస్ వాక్ చేసే అవకాశం కల్పించబోతున్నట్లు ఎనర్జియా వెల్లడించింది.

అయితే ఇటీవల అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం (నాసా).. స్పేస్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తూ, ప్రైవేట్ మిషన్లను ప్రోత్సహించే ఉద్దేశించే రిచర్డ్ బ్రాన్సన్‌కు చెందిన వర్జిన్ గ్యాలక్టిక్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అమెరికాలోనే ప్రత్యేకంగా ట్రెనింగ్ కూడా ఇవ్వబోతున్నట్లు నాసా తెలిపింది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి తమ సంస్థ నుంచి ముగ్గురు అంతరిక్ష యాత్రికులను క్రూ డ్రాగన్ ద్వారా పంపిస్తామని స్పేస్ ఎక్స్ సంస్థ కూడా ప్రకటించింది. ఇదంతా చూస్తుంటే స్పేస్ టూరిజం అనేది ఒక ప్రత్యేక రంగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story

Most Viewed