ఆర్టీసీ కార్మికుల పేస్కేల్, డీఏలు చెల్లిస్తే సంతోషించేవాళ్లం- ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి

by  |
ఆర్టీసీ కార్మికుల పేస్కేల్, డీఏలు చెల్లిస్తే సంతోషించేవాళ్లం- ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు రావాల్సిన 2 పే స్కేళ్లు, 5 డీఏలు, 2013 నుంచి పెండింగ్ లో ఉన్న ఎరియర్స్ బాండ్ల చెల్లింపు ఇంక చెల్లించలేదని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి అన్నారు. కార్మికులపై అధికారులు, సూపర్ వైజర్లు వేధిస్తున్న తీరుపై, తార్నాకలో కొవిడ్ వైద్యం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రకటిస్తే కార్మికులు సంతోషించేవాళ్లని సోమవారం ఒక ప్రటనలో తెలిపారు. టీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వ గ్యారెంటీతో బ్యాంకు లోన్ ద్వారా సమకూరిని రూ.500 కోట్ల అప్పును ఏయే అవసరాలకు వినియోగించనున్నారనే అంశంపై రవాణాశాఖ మంత్రి ప్రభుత్వ అధికారులతో చర్చించి ప్రకటించడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన రూ.500 కోట్లలో రూ.200 తక్షణమే సీసీఎస్ కు చెల్లించాలని ఎన్‌సీడీసీ ద్వారా వచ్చే మిగిలిన డబ్బుల్లో సింహభాగం సీసీఎస్ కు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎన్ సీడీసీ బ్యాంకు నుంచి రూ.500 కోట్ల అప్పు వచ్చాక సీసీఎస్ కు ఇస్తామని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఎస్ కు నెలవారీ రికవరీలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా ఆ లోన్ వచ్చే వరకైనా కొంత మొత్తం సీసీఎస్ కు ఇవ్వాలని ప్రకటించారు. రిటైర్డ్ అయిన వారి సమస్యలను పరిష్కరిస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కారాన్ని కోరుతూ జూలై 12న మంత్రి, సంస్థ ఎండీకి వినతి ఇచ్చినా నేటికీ పట్టించుకోలేదన్నారు. ఆర్థిక పరమైన అంశాలతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఆస్తులను రక్షించడమే కాక సీసీఎస్ కు నిధులిచ్చి పరిరక్షించాలని, ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు చెల్లించాలని టీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈనెల 27న ఎర్రబ్యాడ్జీలు ధరించి ‘పోరాట దినం’ కార్యక్రమం పేరిట నిరసన తెలపనున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ రాజిరెడ్డి తెలిపారు. నిర్మల్ డిపో డీఎం పై పెట్టిన కేసు కూడా ఉపసంహరించుకోవాలన్నారు.



Next Story

Most Viewed