హమాలీ పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.. ఆగ్రహంలో యూనియన్ లీడర్లు

by  |
హమాలీ పని చేస్తున్న ఆర్టీసీ కార్మికులు.. ఆగ్రహంలో యూనియన్ లీడర్లు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో లాక్ డౌన్ విధించడంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు పరిస్థితి దారుణంగా మారిపోయింది. లాక్ డౌన్‌తో రవాణ వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఎలాంటి పనిలేక ఖాళీగా ఉంటున్నారని, కొంత మంది అధికారులు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో హామాలీ పనిచేయిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో హమాలీ పనులు చేయించడం పై యూనియన్ల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది కండక్టర్లు, డ్రైవర్లు గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసిన వారున్నారు అలాంటి వారితో హమాలీ పనులు చేయిచడం సరికాదని యూనియన్ నేతలు అధికారులపై మండిపడ్డారు. ఉద్యోగులు ఎవరూ పనులు చేయకూడదని డిమాండ్ చేశారు. ఉద్యోగుల పట్ల దారుణంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది అధికారులు ఉద్యోగులు హమాలీ పనులు చేయకపోతే వారిపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇలా ఉద్యోగులతో పనిచేయిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు సంస్థ ఎండీనీ కోరారు. ఉద్యోగులతో హామాలీ పనులు చేయించడం సరికాదని ఆర్టీసీలోని ప్రధాన సంఘాలు సంస్థ ఎండీకీ లేఖరాశాయి.


Next Story

Most Viewed