తెలంగాణ ప్రజలకు గమనిక.. రాత్రి 9 గంటల వరకే ఆర్టీసీ బస్సులు

by  |
తెలంగాణ ప్రజలకు గమనిక.. రాత్రి 9 గంటల వరకే ఆర్టీసీ బస్సులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో బస్సుల ప్రయాణ సమయాన్ని కుదిస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సులు రాత్రి 9 గంటలలోపు ఆయా డిపోలకు చేరుకుంటాయని, రాత్రి 9 గంటల తర్వాత సిటీ బస్సులు తిరుగవని ఆర్టీసీ వెల్లడించింది. అంతర్​ జిల్లాలకు వెళ్లాల్సిన బస్సులు మాత్రం రాత్రి 9 గంటలలోపు వెళ్తాయని, రాత్రి 9 తర్వాత బయలుదేరాల్సిన బస్సుల సమయాన్ని 9 గంటలలోపు వెళ్లేలా ఆయా డిపో మేనేజర్లు సమన్వయం చేసుకుంటారంది.

ప్రయాణికులందరూ విధిగా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించిన వారినే బస్సుల్లో ప్రయాణానికి అనుమతిస్తామని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ యాదగిరి తెలిపారు. కర్ఫ్యూ సమయంలో బస్సులు నిలిపివేయడంపై ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. బస్సులు నడపడం అనేది లోకల్​ డిపోమేనేజర్లు నిర్ణయం తీసుకుంటారని, ప్రయాణికులు ఎక్కువగా ఉంటే బస్సులు నడుపాలా? వద్దా? అనేది సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారన్నారు.


Next Story

Most Viewed