బిగ్ బ్రేకింగ్ : కొత్త పార్టీపై RS ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన

by  |
rs-praveen-kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో : బహుజనులే కేంద్ర బిందువుగా కొత్త పార్టీ రావాల్సి ఉందని మాజీ అడిషనల్​డీజీ ఆర్‌ఎస్​ప్రవీణ్ కుమార్​చెప్పారు. బహుజనులకు జ్ఞాన యుద్ధం చాలా అవసరమని, బహుజనుల ప్రయోజనాల కోసం ఉండే సిద్ధాంతం వైపు తాను ఉంటానని స్పష్టంచేశారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరుగలేదని, దాని కోసమే బయటకు వచ్చానన్నారు. అయితే, తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమేనని, కానీ ఎప్పుడు వస్తానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఓ టీవీ చానల్​ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. 99 శాతం బహుజనుల సంక్షేమం కోసమే తాను ఐపీఎస్​పదవిని వదిలివేశానని, ఈ ఆరేండ్లు సమయం వృథా చేయదల్చుకోలేదన్నారు. కేవలం 1 శాతం మంది దగ్గరే సంపద నిక్లిప్తమై ఉందని, 99 శాతం ప్రజలు ఇంకా ప్రభుత్వ తాయిలాలకు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

దళితులకు మూడెకరాలు, పేదలకు ఇండ్లు, రజకులకు ఉచిత విద్యుత్​అనేవి అవసరం లేదని, వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకురావడమే తన ముందున్న లక్ష్యమన్నారు. ఇప్పటివరకు కేవలం తనకున్న పరిమితులతో ఒక అధికారిగా మాత్రమే పని చేశానని, ఇక నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్లు ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. సాంఘీక సంక్షేమశాఖ గురుకులాల్లో అక్రమాలకు తావులేదన్నారు. ప్రభుత్వానికి నష్టం జరిగితే, ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తేలితే ఉరికంభం ఎక్కడానికైనా తాను సిద్ధమేనని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి పిలుపు రాలేదని తేల్చి చెప్పారు. తనను ఏడేండ్లుగా ఒకే సీట్లో కూర్చుండబెట్టడం రాజ్యాంగ బద్ధమని, కొన్ని చోట్ల ఇంకా రిటైరైన వాళ్లు కూడా కీలక పోస్టుల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. దళిత బంధు చర్చలో తనకు పిలుపు లేదని, దాని గురించి ఇప్పుడేం మాట్లాడనని ప్రవీణ్​కుమార్​ చెప్పుకొచ్చారు.

ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌కు ఊహించని షాక్ కరీంనగర్ త్రీ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

Follow our Facebook official page: https://www.facebook.com/dishatelugunews


Next Story

Most Viewed