రోజు రూ. 2 కట్టండి.. నెలకు రూ. 3 వేలు పొందండి.. ఎలాగంటే..?

by  |
currency
X

దిశ, వెబ్‌డెస్క్: అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం.. ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ (PM-SYM) పథకాన్ని ప్రారంభించింది. దీని కింద వీధి వ్యాపారులు, రిక్షావాలా, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగానికి సంబంధించిన వ్యక్తులకు వారి వృద్ధాప్య భద్రతకు సహాయంగా ప్రతినెలా ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది.

18వ ఏటా నుంచే రోజుకు రూ.2 లేదా నెలకు రూ.55 ఆదా చేయడం ప్రారంభిస్తే 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ.3000 పెన్షన్ పొందవచ్చు. 18 సంవత్సరాల వయస్సును తీసుకుంటే, నెలకు రూ.55తో వార్షికంగా రూ.660 అవుతుంది. ఇలా 42 ఏళ్లు చేస్తే మొత్తం పెట్టుబడి రూ.27,720 అవుతుంది. ఆ తర్వాత జీవితాంతం ప్రతినెలా రూ.3,000 పింఛన్ ఇస్తారు. 30 ఏళ్లు నిండిన వారు రూ. 100, 40 ఏళ్ల వారు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకంలో చేరడానికి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్, ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారులు 18 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉండాలి. ఈ స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం, సమీపంలోని CSC కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డ్, సేవింగ్స్ ఖాతా లేదా జన్ ధన్ ఖాతా ఇవ్వాలి. పాస్‌బుక్, చెక్ బుక్ లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ రుజువుగా చూపవచ్చు. ఖాతాను తెరిచే సమయంలో నామినీని కూడా నమోదు చేయవచ్చు. ఈ పథకంలో దరఖాస్తు చేసుకునే కార్మికుని నెల ఆదాయం రూ.15000 లోపు ఉండాలి.

మరిన్ని వివరాల కోసం మీరు కార్మిక శాఖ, LIC, EPFO కార్యాలయానికి వెళ్లి ఈ పథకం గురించి సమాచారాన్ని పొందవచ్చు. లేదా www.maandhan.inని సంప్రదించవచ్చు.


Next Story

Most Viewed