ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు

6

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ నెట్​వర్క్ ​కింద ఉన్న 573ఆస్పత్రులకు రూ.148.37 కోట్లు విడుదల చేసినట్లు వైఎస్సార్​ ఆరోగ్యశ్రీ హెల్త్​కేర్ ​ట్రస్ట్ సీఈఓ మల్లికార్జున రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు ఉన్న బిల్లుల మొత్తం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సంబంధించి రూ.31.97కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. 544ఆస్పత్రులకు జులై నెల వరకు ఉన్న బకాయిలు చెల్లించినట్లు వివరించారు.