బెంగాల్‌కు రూ.1000 కోట్లు

by  |
బెంగాల్‌కు రూ.1000 కోట్లు
X

కోల్‌కత్తా: అంఫాన్ సూపర్ స్లైకోన్ పశ్చిమ బెంగాల్‌‌ను కకావికలం చేసింది. ఈ తుఫాన్ ధాటికి 80 మంది మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, సీఎం మమత బెనర్జీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తక్షణ సాయంగా బెంగాల్‌కు రూ.1000 కోట్లు ప్రకటించారు ప్రధాని మోదీ. అనంతరం ఉత్తర 24 పరగాణాస్ జిల్లాలోని బషిర్‌హాత్‌లో ప్రధాని మీడియాతో మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ప్రధాని ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అనంతరం ప్రధాని ఒడిషా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Next Story

Most Viewed