సమజ్జీవుల పోరు.. సత్తా చాటేదెవరు?

by  |
సమజ్జీవుల పోరు.. సత్తా చాటేదెవరు?
X

దిశ, వెబ్‌డెస్క్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌ స్టేడియం వేదికగా కాసేపట్లో సమజ్జీవుల పోరు మొదలు కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు మరి కాసేపట్లో తలపడనున్నాయి. మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.

ఇప్పటికే ఇరుజట్లు తలో నాలుగు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో మూడింట్లో డీసీ విజయం సాధించి.. ఒక మ్యాచ్‌లో పరాజయం పొందింది. ఇక ఆర్సీబీ కూడా మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఒక మ్యాచ్‌లోనే ఓడిపోయింది.

ఇరు జట్ల బలాబలాలు:

ఢిల్లీ-బెంగళూరు జట్టులో ఆటగాళ్లు మంచి సామర్థ్యలతో పటిష్ఠంగా ఉన్నారు. టాప్ ఆర్డర్‌‌లో ఢిల్లీ తరఫున శిఖర్ దావన్, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యార్, రిషబ్ పంత్, హెట్మేయర్, స్టోయినిస్‌తో చాలా దృఢంగా ఉంది. ఇందులో పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యార్, పంత్ మంచి ఫామ్ కొనసాగిస్తున్నారు. గబ్బర్, హెట్మేయర్, స్టోయినిస్‌ బాగానే ఆడుతున్నా.. వారి స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఇప్పటి వరకు ఆడలేదు. ఇక ఢిల్లీ స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టుకు దూరం కావడం కాస్త ఎదురుదెబ్బే అని చెప్పినా.. రబాడా, నార్ట్జే, ఆశ్విన్, హర్షల్ పటేల్ రాణిస్తున్నరనడంలో ఎటువంటి సందేహం లేదు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో యువ బ్యాట్స్‌మెన్‌ దేవదత్ పడిక్కల్-ఆరోన్‌ ఫించ్‌లు ఓపెనర్లుగా మంచిగానే రాణిస్తున్నారు. మెన్నటి రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బ్యాక్ టు ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ఏబీ డివిలియర్స్ కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శన ఇస్తున్నాడు. వీరిద్దరిలో ఏ ఒక్కరు చెలరేగిన బెంగళూరు విజయం లాంఛనమే. ఇక బౌలింగ్‌లో యూజువేంద్ర చాహల్ చక్కగా రాణిస్తున్నాడు. అతడికి తోడు ఇసురు ఉదాన, నవదీప్ సైని చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేస్తున్నాడు. ఇంతటి సమజ్జీవుల పోరులో నేటి మ్యాచ్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Next Story