వెరీ స్పెషల్.. ఒకే కాలేజ్ నుంచి ఐదుగురు ఒలింపియన్స్‌

by  |
Olympians
X

దిశ, ఫీచర్స్ : ఒలింపిక్స్.. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ విశ్వక్రీడా సమరంలో పాల్గొనాలనేది ప్రతీ క్రీడాకారుడి కల. దేశానికి ప్రాతినిథ్యం వహించే ఈ సువర్ణావకాశాన్ని దక్కించుకునేందుకు కఠోరంగా శ్రమిస్తుంటారు. ఈ క్రమంలో తమ కల సాకారానికి కోచ్‌లు, కోచింగ్ సెంటర్ల పాత్రను విస్మరించలేం. కాగా భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొన్న ‘రోసా కుట్టీ నుంచి అంజు బాబీ జార్జ్’ వరకు ఐదుగురు ఒలింపియన్స్‌కు శిక్షణనివ్వడంలో కేరళకు చెందిన విమల కాలేజ్ ఇంపార్టెంట్ రోల్ పోషించింది. ప్రత్యేకించి త్రిస్సూర్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో 30 ఏళ్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పనిచేసిన ప్రొఫెసర్ అనీ వర్గీస్ శిక్షణలోనే ఇది సాధ్యమైంది.

2000 సమ్మర్ ఒలింపిక్స్‌లో 4×400 మీటర్స్ రిలేలో పాల్గొన్న జిన్సీ ఫిలిప్.. ఏషియన్ గేమ్స్‌లో అనేక పతకాలను సాధించింది. కాలేజ్‌లో ఉండగా తనకు కనీసం సరైన స్పైక్ షూస్ కూడా లేవని.. ప్రొఫెసర్ అనీనే ఫస్ట్ టైమ్ తనకు జత స్పైక్స్ ఇచ్చిందని తెలిపింది. ప్రస్తుతం తను సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్‌పీఎఫ్)లో పనిచేస్తోంది. అయితే ప్రొఫెసర్ వర్గీస్ శిక్షణలో విమల కాలేజ్ నుంచి ఒలింపిక్స్‌ ప్రస్థానం జిన్సీతోనే ఆగిపోలేదు. ఇప్పటి వరకు కేరళ నుంచి ఒలింపిక్స్‌లో పాల్గొన్న 19 మంది మహిళల్లో 2004 నుంచి 2008 వరకు ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన అంజు బాబీ జార్జి సహా ఐదుగురు ఒలింపియన్స్ ఆ కాలేజ్ వారే.

1996 సంవత్సరం అట్లాంటాలో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొన్న రోసా కుట్టీ, ఈ కాలేజ్ నుంచి ఎంపికైన మొదటి వ్యక్తి. కాగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో ఇండియన్ ఉమెన్స్ 4×400 రిలే టీమ్‌లో జిన్సీ, మంజిమ కురియకోస్ సభ్యులు. అంతేకాదు 2004 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న హై జంపర్ బాబీ అలోసియస్‌ది ఇదే కాలేజ్. కాగా విమల కాలేజ్ నుంచి ఇంతమంది ఒలింపియన్స్ తయారుకావడం పట్ల కోచ్ అన్నీ వర్గీస్ తన అనుభవాలను పంచుకుంది. 1998లో రిటైర్ అయిన ఈ 77 ఏళ్ల మహిళ ప్రస్తుతం ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటోంది.

సౌకర్యాల లేమి ప్రతిభకు అడ్డు కాలేదు..

ఈ అథ్లెట్లు విమల కళాశాలలో విద్యార్థులుగా ఉన్నప్పుడే.. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను లీడ్ చేయడం యాదృచ్చికమే కాదు, ఐదుగురు ఒలింపియన్స్‌ను తయారుచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆ టైమ్‌లో కాలేజ్‌లో సరైన గ్రౌండ్ ఫెసిలిటీ కూడా లేదు. అయితే వారి ప్రతిభకు ఇది అడ్డుకాలేదు. మా కాలేజ్ చిన్నది కావడంతో పక్కనున్న ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో చీకటిపడేవరకు ట్రైనింగ్ కొనసాగించేవాళ్లం. అప్పుడు కాలేజ్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన నన్స్ అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఇండియాలో మరే కాలేజ్ కూడా ఇంతమంది ఒలింపియన్స్‌ను అందించలేదు. పాలక్కడ్‌లోని మెర్సీ కాలేజ్ నుంచి మాత్రమే నలుగురు ఒలింపియన్స్ (పీటీ ఉష, ఎండీ వల్సమ్మ, మెర్సీ కుట్టన్, కె సారమ్మ) ఉన్నారు.
– అనీ వర్గీస్, పీఈటీ, విమల కాలేజ్, త్రిస్సూర్

VIMALA-COLLEGE

Next Story

Most Viewed