రొనాల్డో దాతృత్వం.. మెడికల్ ఎక్విప్‌మెంట్ అందజేత

by  |
రొనాల్డో దాతృత్వం.. మెడికల్ ఎక్విప్‌మెంట్ అందజేత
X

క్రీడా ప్రపంచానికి క్రిస్టియానో రొనాల్డో పేరు సుపరిచితమే. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ అయిన రొనాల్డో, అతని ఏజెంట్ మెండెస్ కలసి కరోనా బాధితులకు సేవలందిస్తున్న ఆసుపత్రికి ఐసీయూ ఎక్విప్‌మెంట్ కొనిచ్చారు. దీని విలువ భారతీయ కరెన్సీలో 8.20 కోట్ల రూపాయలు. పోర్చుగల్ ఆసుపత్రులు కరోనా బాధితులకు వైద్య సేవలు అందించడానికి అష్టకష్టాలు పడుతున్నాయి. సరైన పరికరాలు లేకపోవడంతో వైద్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకొన్న రొనాల్డో తన ఏజెంట్‌తో కలసి ఈ సామగ్రిని అందించారు.

లిస్బన్ సాంటా మారియా ఆసుపత్రిలో రెండు వార్డులకు సరిపడా వెంటిలేటర్లు, హార్ట్ మానిటర్లు, ఇన్ఫ్యూజన్ పంపులు, సిరంజీలు అందించినట్లు ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు మెండెస్ వెయ్యి మాస్కులతో పాటు 2 లక్షల ప్రొటెక్టివ్ గౌన్లను సావో జో ఆసుపత్రికి అందించాడు.

యూరోప్‌లోని ఇటలీ, స్పెయిన్‌లను ఆనుకొని ఉన్న పోర్చుగల్ దేశంలో ఇప్పటి వరకు 2362 కరోనా కేసులు నమోదవగా.. 29 మంది మరణించారు. అక్కడి ప్రభుత్వం చైనా నుంచి అవసరమైన వెంటిలేటర్లు, మాస్కులు తెప్పించుకుంటోంది.

Tags: Portuguese Star Football Player, Cristiano Ronaldo, Corona, Medical Equipment, Portugal, Hospitals



Next Story

Most Viewed