ప్రమాదంగా మారిన పట్టించుకోరా..? ప్రమాదాలకు అడ్డాగా ఎన్నారం గడ్డ..

by  |
ennaram
X

దిశ, వికారాబాద్: వికారాబాద్ జిల్లా, కోటపల్లి మండలం పరిధిలో ఉన్న రోడ్ల దుస్థితి చూస్తుంటే మండలంలో అసలు ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారా..? అనే అనుమానం రాకుండా ఉండదేమో. మండలంలో ఏ రోడ్డును చూసినా గుంతలమయం. ప్రతి 100 మీటర్లు, హాఫ్ కిలోమీటర్ దూరానికి అడుగడుగునా గుంతలు తప్ప ఇంకేమి కనిపించడం లేదు. ఈ గుంతలలో వాహనాలు నడపాలి అంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొవాల్సిందే అంటున్నారు వాహనదారులు. ముఖ్యంగా కోటపల్లి మండలం, ఎన్నారం గ్రామం పరిధిలో 100 మీటర్లకు ఒక గుంత కనిపిస్తున్న దుస్థితి. ఎన్నారం గుట్టపైన పెద్ద గుంత ఏర్పడంతో ఈ రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారింది.

ఈ సమస్య చాలా ఏళ్లుగా ఉన్న ఆర్ అండ్ బి అధికారులు మాత్రం ఎన్నారం రోడ్డును పట్టించుకునే పాపాన పోలేదు అంటున్నారు ప్రజలు. ఎన్నారం గ్రామ ప్రజలు, వాహనదారులు. ఈ రోడ్లు బాగు చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒక్కరంటే ఒక్కరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ గుంతలలో పడి చాలామంది తమ కాళ్లు, చేతులు విరగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్న రోడ్ల ప్యాచ్ వర్క్ పనులు మాత్రం చేయడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్ర మేలుకొని రోడ్లు బాగు చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామాల ప్రజలు, వాహనదారులు వేడుకుంటున్నారు.

Next Story

Most Viewed