జనగామలో జోరుగా వర్షం.. రైతుల కళ్లల్లో హర్షం

by  |
జనగామలో జోరుగా వర్షం.. రైతుల కళ్లల్లో హర్షం
X

దిశ, జనగామ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం ఓ మోస్తారు వర్షం పడింది. దీంతో జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా జనగామలోని హన్మకొండ హైదరాబాద్ రోడ్‌లో గల లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీటితో నిండి జలమయంగా మారాయి. దీంతో వాహనాల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకునేందుకు వర్షం పడిన సమస్య సందర్భాల్లో ఇబ్బందిగా ఉందని వర్షం పడినప్పుడు దుకాణాల ముందు వర్షం నీరు నిలిచి పోతుందని, అధికారులు పట్టించుకోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి జనగామ లోని ప్రధాన రహదారిలో వెంట ఉన్న డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించి వర్షపు నీరు నిలువకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story