- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రకాశం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం..ముగ్గురు దుర్మరణం

X
దిశ, ఏపీ బ్యూరో : ప్రకాశం జిల్లా బుధవారం నెత్తురోడింది. గుడ్లూరు మండలం చేవూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై చేవూరు వద్ద ఆగివున్న లారీని ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. యాక్సిడెంట్ జరిగిన విధానంపై ఆరా తీస్తున్నారు. మృతులు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని మిట్టకూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
- Tags
- ap
Next Story