రిషి కపూర్ … బాధ్యత ఉండక్కర్లేదా?

by  |
రిషి కపూర్ … బాధ్యత ఉండక్కర్లేదా?
X

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు సినీ ప్రముఖులు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇంట్లో ఉంటూనే సోషల్ మీడియా వేదికగా ప్రజలకు సూచనలు అందిస్తూ… ఆరోగ్య భారతానికి సహాయ పడుతున్నారు. మరెంతో మంది పెద్ద మనసు చాటుతూ… కోట్లలో, లక్షల్లో విరాళాలు అందిస్తున్నారు. ఇంత మంది గొప్ప వారి మధ్య ఓ చీడ పురుగులా కనిపిస్తున్నారు బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రిషి కపూర్. కనీస సామాజిక బాధ్యత లేకుండా అతను చేసిన ట్వీట్ తో విమర్శలు ఎదుర్కొంటున్నారు.

కరోనా ఎదుర్కొనేందుకు ఇంటి పట్టునే ఉండాలని ప్రభుత్వం సూచిస్తూ… ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో చెబుతుంటే… రిషి కపూర్ మందు షాపులు తెరవొచ్చుగా కాస్త ఎంజాయ్ చేస్తాం అంటూ ట్వీట్ చేశాడు. రోజూ సాయంత్రం టైంలో బార్లు ఓపెన్ చేస్తే… కాస్త రిలాక్స్ అవుతామని… ప్రభుత్వానికి డబ్బులు కూడా వస్తాయి కదా అంటూ పోస్ట్ పెట్టాడు. అంతటితో ఆగకుండా మందేసి ఎలా ఎంజాయ్ చేయాలో కూడా ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో మండిపోయిన నెటిజన్లు బాధ్యత ఉండక్కర్లేదా అని తిట్టి పోస్తున్నారు. దేశమంతా మహమ్మరితో అల్లకల్లోలం అవుతుంటే నీకు మందు, చిందు కావాల్సి వచ్చిందా అని మండిపడుతున్నారు.


Next Story

Most Viewed