కేజీ డీ6 'శాటిలైట్ క్లస్టర్' నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించిన రిలయన్స్!

by  |
కేజీ డీ6 శాటిలైట్ క్లస్టర్ నుంచి గ్యాస్ ఉత్పత్తి ప్రారంభించిన రిలయన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్రిటన్‌కు చెందిన గ్యాస్ సంస్థ బీపీ పీఎల్‌సీతో కలిసి కృష్ణా-గోదావరి బ్లాక్‌లోని కేజీ డీ6 వద్ద ఉన్న శాటిలైట్ క్లస్టర్ నుంచి సహజవాయువు ఉత్పత్తిని ప్రారంభించినట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) ప్రకటించింది. ఈ బ్లాక్‌లో ఆర్ఐఎల్ 66.67 శాతం వాటాతో ప్రధాన ఆపరేటర్‌గా ఉంది. బ్రిటన్ గ్యాస్ కంపెనీ బీపీ 33.33 శాతం వాటాను కలిగి ఉంది. దేశ అవసరాలను తీర్చడానికి రిలయన్స్ సంస్థ డీ6 బ్లాక్‌లోని ఆర్ క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజె క్లస్టర్ డీప్ వాటర్ గ్యాస్ నిక్షేపాల నుంచి సహజవాయువును వెలికితీస్తోంది.

ఈ మూడు క్లస్టర్ల నుంచి 2023 నాటికి రోజుకు 100 క్యూబిక్ అడుగుల సహజవాయువును ఉత్పత్తి చేయనుంది. ఈ మొత్తం దేశంలోని 15 శాతం గ్యాస్ అవసరాలను తీర్చనుంది. కాకినాడాకు 60 కి.మీ దూరంలో ఉన్న శాటిలైట్ క్లస్టర్ ఉందని రిలయన్స్ సంస్థ తెలిపింది. 5 బావులు, 4 రిజర్వాయర్ల నుంచి గ్యాస్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు పేర్కొంది. దేశంలో ఉన్న మొత్తం గ్యాస్ ఉత్పత్తిలో ఆర్ క్లసటర్, శాటిలైట్ క్లస్టర్ వాటా 20 శాతానికి చేరే అవసాం ఉందని కంపెనీ వెల్లడించింది. గతేడాది డిసెంబర్‌లో మొదటి ఫీల్డ్ ఆర్ క్లస్టర్‌ను ప్రారంభించిన తర్వాత, చివరి మూడో క్లస్టర్ 2022 చువర్లో వినియోగంలోకి వస్తుందని కంపెనీ తెలిపింది.

Next Story

Most Viewed