కరోనా వ్యాక్సిన్‌కు భయపడుతున్నారు.. ఎందుకు..?

by  |
కరోనా వ్యాక్సిన్‌కు భయపడుతున్నారు.. ఎందుకు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రానురాను ఆయా శాఖల్లో వ్యాక్సిన్ పట్ల అపోహలు పెరుగుతూ ఉండటంతో కొందరు సిబ్బంది వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో కొన్నిచోట్ల దుష్ఫలితాలు తలెత్తాయని మీడియాలో వచ్చిన వార్తల వల్ల ఇక్కడ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలంటేనే భయపడుతున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలంటే వారం రోజుల ముందు నుంచి ప్రధానంగా కొన్ని ఆహార పదార్థాలు తినకుండా ఉండాలని, వ్యాక్సిన్ మొదటి డోసు, తర్వాతి బూస్టర్ డోసు కలుపుకొని మొత్తం 42 రోజుల వరకు మాంసాహారం, గుడ్లు, మద్యం ముట్టరాదనే వదంతులు వ్యాపించడంతో చాలా మంది ఉద్యోగులు జంకుతున్నారు. సోమవారం రెవెన్యూ ఉద్యోగులకు వ్యాక్సిన్ కార్యక్రమం ఉంటుందని ఆదివారం సాయంత్రం రిజిస్టర్డు మొబైల్ నంబర్లకు మెసేజులు వచ్చాయి. అవసరమైన డోసుల వయల్స్ సైతం అన్ని జిల్లాల్లోని గుర్తించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరుకున్నాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు చేసుకోగా, చాలా వరకు కేంద్రాల్లో ఆశించిన స్పందన కరువైంది.

తిప్పిపంపిన వైద్యాధికారులు..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40,000 మంది రెవెన్యూ సిబ్బంది ఉంటారని అంచనా వేయగా వ్యాక్సిన్ వేయించుకున్న మొత్తం సిబ్బంది 25% శాతం కూడా ఉండరని ఒక అంచనా. వ్యాక్సిన్ వయల్ (మందు సీసా) ద్వారా కనీసం 8 మందికి టీకా వేయాల్సి ఉంది. ఒక్కసారి వయల్ వాడకం మొదలు పెట్టాక 15 నిమిషాల్లోపే అందులోని టీకా మందుని ఎట్టి పరిస్థితుల్లోనూ 8 మందికి సూది ద్వారా వేయాల్సిందే. లేదంటే ఆ మందు వృథా అయినట్టే. ఈ నిబంధన వల్ల కొన్ని చోట్ల సోమవారం అసలు టీకాలు వేయని కేంద్రాలు కూడా ఉండటం గమనార్హం. కొన్నిచోట్ల 8 మంది కంటే తక్కువ వచ్చారని వారందరినీ వైద్య అధికారుకు వెనక్కి తిప్పి పంపడం గమనార్హం. చాలా సెంటర్లలో మధ్యాహ్నం 2 దాకా ఎవరూ రాకపోవడం కొసమెరుపు.



Next Story