మాజీ ఆర్మీ ఉద్యోగి భూమిపై కబ్జాకోరుల కన్ను..!

by  |
మాజీ ఆర్మీ ఉద్యోగి భూమిపై కబ్జాకోరుల కన్ను..!
X

దిశ, హుజూర్‌నగర్: దేశ రక్షణ కోసం బార్డర్‌లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికులకు సమాజంలో విలువలేకుండా చేస్తున్నారు. 21 సంవత్సరాల పాటు దేశ సేవ చేసిన సైనికుడికి గుర్తింపు‌గా 5 ఎకరాల భూమిని స్వయంగా ప్రభుత్వమే సర్వే చేసి మరీ అందించింది. కానీ, ఆ భూమిపై కబ్జా కోరులు కన్నేసి.. మాజీ ఆర్మీ అధికారికి ఇబ్బందులు తీసుకొచ్చిన ఘటన సూర్యాపేట జిల్లాలో వెలుగుచూసింది.

పూర్తి వివరాళ్లోకి వెళితే.. చింతలపాలెం మండలానికి చెందిన షేక్ అహ్మద్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. గతంలో ఆయనకు ప్రభుత్వం ఇదే మండలంలోని వజినేపల్లిలో 5 ఎకరాల భూమిని కేటాయించింది. దీనికితోడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం నుంచి పట్టాదారు పాసు పుస్తకం కూడా వచ్చింది. కాగా, మండలానికి చెందిన పలువురు లోకల్‌ కాంగ్రెస్ లీడర్ల సహకారంతో తన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని.. పలుమార్లు బెదిరింపులకు కూడా దిగారని షేక్ వాపోయారు.

పొలం పనులు చేస్తుండగా అడ్డుతగలడమే కాకుండా.. తనపై దాడి చేశారని.. ప్రభుత్వం గుర్తింపుగా ఇచ్చిన భూములను కూడా కబ్జా చేయడం ఏంటని పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. కనీసం ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తనకు చెందాల్సిన భూమిని అప్పగించాలని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి ప్రాదేయపడుతున్నారు.


Next Story

Most Viewed