అమ్మాయికి బోన్ క్యాన్సర్.. కేటీఆర్ సాయం చేయాలంటూ రిక్వెస్ట్

by  |
అమ్మాయికి బోన్ క్యాన్సర్.. కేటీఆర్ సాయం చేయాలంటూ రిక్వెస్ట్
X

దిశ, వీర్నపల్లి: చదువుకునే వయసులో అమ్మాయికి బోన్ క్యాన్సర్ రావడంతో ఆమె తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. చికిత్స కోసం ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించినప్పటికీ.. పూర్తిస్థాయి చికిత్స చేసేందుకు మరో రూ. 6 లక్షలు కావాలని వైద్యులు తెలపడంతో ఏమీ చేయలేని దుస్థితిలో మంత్రి కేటీఆర్ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట్ మండలం గుండారం గ్రామానికి చెందిన మూడవత్ భోజ్య నాయక్ -లక్ష్మీకి ముగ్గురు సంతానం. చిన్న కూతురు మూడవత్ మెర్సీ (18) ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేసింది. ఉన్నత చదువులు చదువుకోవాలని అనుకున్నప్పటికీ అంతలోనే బోన్ క్యాన్సర్ బారిన పడింది. గత నెల రోజులుగా నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. ఇప్పటికే వైద్యానికి రూ. 5 లక్షలు ఖర్చు అయిందని, ఇప్పటికే ప్రభుత్వం రూ. 2 లక్షల ఎల్వోసీ ఇచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. ఇంకా వైద్యనికి రూ. 6 లక్షలు కావాలని దాతలు ముందుకు వచ్చి తమ పాపను ఆదుకోవాలంటూ తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మంత్రి కేటీఆర్ తమ ప్రాణాలను కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు.


Next Story

Most Viewed