రిలయన్స్ జ్యువెలరీ వార్షికోత్సవ కలెక్షన్లు

by Harish |   (  Updated:2020-08-13 05:43:50  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ జ్యువెలరీ(Jewelery) బ్రాండ్ సంస్థ రిలయన్స్ జ్యువెల్స్(Reliance Jewels) సరికొత్త కలెక్షన్లను లాంచ్ చేసింది. సంస్థ వార్షికోత్సవం(Anniversary) సందర్భంగా &#8216;అభర్'(Aabhar) పేరున 54 కొత్త డిజైన్లతో బంగారం, వెండి, వజ్రాభరణాల కలెక్షన్లను తీసుకొచ్చింది. దశాబ్దానికి పైగా తమ బ్రాండ్‌(Brand)కు అండగా ఉన్న వినియోగదారులందరికీ కృతజ్ఞతలు(Thanks) తెలుపుతూ వీ వో యూ(మీకు రుణపడి ఉన్నాం) అనే థీమ్‌తో ఈ కలెక్షన్లను ప్రమోట్ చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ఈ కలెక్షన్లలో ఉన్న వెరైటీస్ 3 గ్రాముల [&hellip;]</p>

రిలయన్స్ జ్యువెలరీ వార్షికోత్సవ కలెక్షన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ జ్యువెలరీ(Jewelery) బ్రాండ్ సంస్థ రిలయన్స్ జ్యువెల్స్(Reliance Jewels) సరికొత్త కలెక్షన్లను లాంచ్ చేసింది. సంస్థ వార్షికోత్సవం(Anniversary) సందర్భంగా ‘అభర్'(Aabhar) పేరున 54 కొత్త డిజైన్లతో బంగారం, వెండి, వజ్రాభరణాల కలెక్షన్లను తీసుకొచ్చింది. దశాబ్దానికి పైగా తమ బ్రాండ్‌(Brand)కు అండగా ఉన్న వినియోగదారులందరికీ కృతజ్ఞతలు(Thanks) తెలుపుతూ వీ వో యూ(మీకు రుణపడి ఉన్నాం) అనే థీమ్‌తో ఈ కలెక్షన్లను ప్రమోట్ చేస్తున్నట్టు సంస్థ వెల్లడించింది.

ఈ కలెక్షన్లలో ఉన్న వెరైటీస్ 3 గ్రాముల నుంచి 15 గ్రాముల మధ్య ఉంటాయని తెలిపింది. అలాగే, బంగారు ఆభరణాల(Gold jewelry)పై మేకింగ్ ఛార్జీలో 24 శాతం, వజ్రాభరణాల(Diamond jewelery)పై 30 శాతం తగ్గింపును ప్రత్యేక వార్షికోత్సవా ఆఫర్‌(Special Anniversary Offer)గా సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్స్ ఈ నెల చివరి వరకు ఉండనున్నట్టు, కొవిడ్-19 నేపథ్యంలో భౌతిక దూరం వంటి నిబంధనలపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని రిలయన్స్ జ్యువెలరీ వెల్లడించింది. ఆధునిక మహిళలకు నచ్చే విధంగా ఈ సరికొత్త కలెక్షన్లను రూపొందించామని, క్లిష్ట సమయంలోనూ సంస్థకు మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని రిలయన్స్ జ్యువెల్స్(Reliance Jewels) సీఈవో సునీల్ నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story