అందరికీ ఉచిత భోజనం, ఇంధనం : రిలయన్స్

by  |
అందరికీ ఉచిత భోజనం, ఇంధనం : రిలయన్స్
X

దేశమంతా కరోనా భయంతో వణికిపోతోంది. కరనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రిలయన్స్ ఇండస్ర్టీస్ తన వంతు సాయాన్ని ప్రకటించింది. కరోనా బాధితులను తరలించేందుకు, వారి చికిత్సకు అవసరం అయ్యే పరికరాల తరలింపునకు వినియోగించే వాహనాలు దేశంలోని అన్ని రిలయన్స్ ఫ్యూయల్ స్టేషన్లలో ఉచితంగా ఫ్యూయల్ నింపుతామని రిలయన్స్ అధినేత ప్రకటించారు. అంతేకాదు రోజుకు లక్ష ఫేస్ మాస్క్ లు ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.

కరోనా వైరస్ సోకిన వారికి వైద్య సేవలు అందించేందుకు.. తమ ముంబై ఆసుపత్రిలో 100 పడకలను సిద్ధం చేశామని రిలయన్స్ వెల్లడించింది. రిలయన్స్ సంస్థల్లో పని చేసే కాంట్రాక్టు, టెంపరరీ వర్కర్స్ అందరికి జీతాలు, వేతనాలు చెల్లిస్తామని.. కరోనా వైరస్ సృష్టించిన ఈ సంక్షభంలో ఉద్యోగులు విధి నిర్వహణకు రాకపోయినా కూడా వారికి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించింది. దేశంలోని పలు నగరాలలో రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది రిలయన్స్ సంస్థ.

Tags: RELIANCE, MUKESH AMBANI, COVID 19, CORONAVIRUS, SALARY, FREE, FOOD, FUEL

Next Story

Most Viewed