ప్రభుత్వ డాక్టర్లను కొట్టిన మృతుడి బంధువులు

109

దిశ, కొత్తగూడెం: డాక్టర్లు పేషెంట్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ దాడికి పాల్పడిన ఘటన కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. సుజాతనగర్‌కి చెందిన మహబూబ్ అబ్దుల్లాకు గురువారం రాత్రి శ్వాసతీసుకోవడంలో ఇబ్బందికరంగా మారింది. దీంతో హుటాహుటిన కుటుంబీకులు కొత్తగూడెం హాస్పిటల్‌లో చేర్పించారు. ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్‌ చేసుకున్న వైద్యులు చికిత్స మొదలు పెట్టారు. కానీ, అబ్దుల్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు మరణించాడు. ఇక అతడి మరణ వార్తను జీర్ణించుకోలేకపోయిన బంధువులు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే అబ్దుల్లా మరణించాడని దాడులకు పాల్పడ్డారు. ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనవసరంగా తమపై దాడికి పాల్పడ్డారంటూ వైద్య సిబ్బంది ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..