1,074 మంది కోలుకున్నారు: కేంద్రం

by  |
1,074 మంది కోలుకున్నారు: కేంద్రం
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నట్టే ఆ మహమ్మారి నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సోమవారం ఇటువంటి ఊరటనిచ్చే కబురే కేంద్రప్రభుత్వం చెప్పింది. గడిచిన 24 గంటల్లో 1,074 మంది ఈ వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయినట్టు వెల్లడించింది. ఒక్క రోజులో ఇంతమంది కోలుకోవడం ఇదే మొదటిసారి. దీంతో మొత్తంగా ఈ వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 11,761కు చేరింది. రివకరీ రేటు 27.52శాతానికి చేరిందని సర్కారు తెలిపింది. కాగా, కరోనా కేసులూ భారీగానే నమోదయ్యాయి. 24 గంటల్లోనే 2,553 కొత్త కరోనా కేసులు రిపోర్ట్ అయ్యాయని పేర్కొంది. దీంతో మొత్తం కరోనా కేసులు 42,835కి పెరిగినట్టు వివరించింది. కాగా, ఒక్కరోజే 83 మంది చనిపోవడంతో కరోనా మరణాలు మొత్తం 1,389కు పెరిగాయని తెలిపింది. ఎప్పటిలాగే మహారాష్ట్ర కరోనా కేసుల్లో మొదటిస్థానంలో ఉన్నది. 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 12,974కు చేరింది. కాగా, 548 మంది చనిపోయారు. తమిళనాడులో కొత్తగా 527 కరోనా కేసులు వెలుగుచూడటంతో ఈ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,550కి పెరిగింది. ఇందులో కేవలం చెన్నై నగరంలోనే 266 కేసులు రిపోర్ట్ అయ్యాయి. 24 గంటల్లో 30 మంది పేషెంట్లు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఒక్కరు చనిపోవడంతో మొత్తం కరోనా మరణాలు 31కి పెరిగింది. గుజరాత్‌లో మొత్తం కరోనా కేసులు 5,428కు పెరగ్గా.. ఢిల్లీలో 4,549కు చేరింది. దేశంలోని రాష్ట్రాలది ఒక దారి అయితే.. కేరళది మరోదారి. ఈ రాష్ట్రం వేగంగా కరోనా కోరల్లో నుంచి బయటపడుతున్నది. సోమవారం రికార్డు స్థాయిలో రికవరీలు నమోదయ్యాయి. 24 గంటల్లో 61 మంది పేషెంట్లు కరోనా నుంచి చెర నుంచి విముక్తి చెంది డిశ్చార్జీ అయ్యారు. దీంతో కేరళలోని 95 యాక్టివ్ కేసులు ఒక్కసారిగా కేవలం 34కు పడిపోయాయి. ఇదిలా ఉండగా.. ఈ రాష్ట్రంలో కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

tags: coronavirus, cases, india, highest, recoveries, discharge, kerala


Next Story

Most Viewed