ఓటెత్తారు.. రికార్డ్ స్థాయిలో నమోదైన పోలింగ్

by  |
wgl-Poling-record21
X

దిశ ప్రతినిధి, వరంగల్: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం ఉదయం 7గంటల నుంచే ఓటర్లు కేంద్రాల ఎదుట పోలింగ్ కు బారులు తీరారు. మునుపెన్నడూ లేని విధంగా మండలంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం గమనార్హం. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతల హడావుడి కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హన్మకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి శంబునుపల్లి గ్రామాలను సందరిశాచారు. పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు.

7 గంటల తర్వాత కూడా కొనసాగిన పోలింగ్

ఉదయం7 గంటల నుంచి మొదలైన పోలింగ్ రాత్రి 8 గంటల వరకు చాలా కేంద్రాల్లో కొనసాగడం గమనార్హం. రాత్రి7 గంటల తర్వాత కేంద్రాల్లో క్యూలో నిల్చున్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇదిలా ఉండగా పోలింగ్ సరళిపై రాజకీయ పక్షల్లో ఆసక్తి నెలకొంది. పెరుగుతున్న పోలింగ్ ఎవరి వైపు అన్న టెన్షన్ నేతల్లో కనిపించడం విశేషం.


Next Story

Most Viewed