చస్తున్నా పట్టించుకోరా..? ఈ రంధ్రాన్ని ఎప్పుడు పూడుస్తారు

by  |
చస్తున్నా పట్టించుకోరా..? ఈ రంధ్రాన్ని ఎప్పుడు పూడుస్తారు
X

దిశ, ఖమ్మం రూరల్​ : నడిరోడ్డుపై రంధ్రం పడి మూడు రోజులు గడుస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. రూరల్​ మండలం పెద్ద తండా వద్ద ఖమ్మం నుంచి సూర్యాపేట ప్రధాన రహదారి నడి మధ్యలో మూడు రోజుల కిందట రంధ్రం ఏర్పడింది. మొదట చిన్నదిగా ఉన్నా రోజురోజుకూ పెద్దదిగా మారుతోంది. నడిరోడ్డు పైన రంధ్రం పెద్దదిగా మారుతున్నా ఆర్​అండ్​బీ అధికారులు పట్టించుకోవడం లేదు. వారు నిర్లక్ష్యానికి నిలువుటద్ధంలా తయారయ్యారు.

రోడ్డుకు మధ్యలో ఏర్పడిన గుంతను గమనించకపోవడంతో ఇద్దరు వ్యక్తులు కింద పడిపోయి గాయాలపాలయ్యారు. కొందరు స్థానికులు మాత్రం రంధ్రం చుట్టు రాళ్లను ఏర్పాటు చేసి వాహనదారులను అలర్ట్​ చేశారు. దీని వలన కేవలం ద్విచక్ర వాహనదారులకే కాదు పెద్ద వాహనాలైన కార్లు, లారీలు ఈ రంధ్రం మీద నుంచి వెళ్లితే ప్రమాదం జరగకమానదనే చెప్పాలి. ఇది ఇలాగే ఉంటే పెను ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.


Next Story

Most Viewed