Ind Vs Nz : రికార్డులు బద్దలు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్..

by  |
Ind Vs Nz : రికార్డులు బద్దలు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : వాంఖేడ్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ సంవత్సరం టెస్టుల్లో 50 వికెట్లను తీసిన మొదటి బౌలర్‌గా అశ్విన్‌ రికార్డుకెక్కాడు.

అంతేకాకుండా భారత్-కివీస్‌ ద్వైపాక్షిక టెస్టు సిరీసుల్లో మాజీ ఆల్‌రౌండర్‌ సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ రికార్డును అశ్విన్‌ సమం చేశాడు. టీమిండియా, కివీస్ తలపడిన టెస్టుల్లో హ్యాడ్లీ 24 ఇన్నింగ్స్‌ల్లో 65 వికెట్లను పడగొట్టగా.. అశ్విన్ కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ రికార్డును బద్దలు కొట్టాడు. కాగా, ఈ సంవత్సరం టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో అశ్విన్ తర్వాత స్థానాల్లో పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్లు షహీన్‌ అఫ్రిది (44), హసన్‌ అలీ (39) ఉన్నారు.

ఇక రెండో టెస్టు మ్యాచ్ భారత్ పట్టుసాధించింది. 540 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 140/5 పరుగులు చేసింది. భారత్ గెలుపు కోసం మరో 5 వికెట్లు కావాల్సి ఉండగా.. కివీస్ ఇంకా 400 పరుగులు వెనుకబడి ఉంది.

న్యూజిలాండ్‌పై టీమిండియా భారీ విజయం.. రికార్డులు బ్రేక్

టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శన అదే.. గంగూలీ సీరియస్ కామెంట్స్


Next Story

Most Viewed