ఎమ్మెల్సీ తాతా మధుని సన్మానించిన రేషన్ డీలర్లు

by Sridhar Babu |   ( Updated:2022-01-07 08:22:54.0  )
ఎమ్మెల్సీ తాతా మధుని సన్మానించిన రేషన్ డీలర్లు
X

దిశ, అశ్వాపురం: కొత్తగూడెం పట్టణంలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ తాతా మధును రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొడాలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సన్మానించారు.

ఈ సందర్భంగా ఆయన పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు అందించాలని కోరుతూ.. తాతా మధుకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అలాగే రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కందాల ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకుడు మల్లెల రవిచంద్ర పాల్గొన్నారు.

Advertisement

Next Story