హైదరాబాద్‌లో మరో దారుణం.. మూడేళ్లుగా కన్న కూతురిపై అత్యాచారం

188

ఆడ పుట్టుకే కామాంధుల పాలిట శాపంగా పరిణమించింది… పసిమొగ్గల నుంచి పండు ముసలి వరకు ఎవరిని వదలడం లేదు … తన వారెవరో .. పరాయి వారెవరో.. ఎక్కడ ప్రమాదం పొంచి ఉందొ .. ఎలా బతకాలో తెలియక అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నా .. ఎక్కడో ఒక చోట అత్యాచార ఖాండ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.

దిశ, చార్మినార్ :  తాజాగా పాతబస్తీలో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. వావి వరసలు మరిచిన తండ్రి రెండవ భార్య కూతురి పై గత మూడేళ్ళుగా అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే నీతో పాటు నీ తల్లి ని చంపేస్తానంటూ బెదిరిస్తూ దారుణానికి ఒడిగట్టాడు. తల్లి పసికట్టడంతో దారుణ అత్యాచార ఖాండ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేవుతుంది.

చాంద్రాయణగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం … పాతబస్తీ చాంద్రాయణగుట్ట గౌస్ నగర్‌కు చెందిన ఇళ్లలో పాచి పనులు చేసే మహిళకు ఓ కూతురు (14)తో పాటు ఇద్దరు కుమారులు సంతానం. భర్తతో కొన్నేళ్ల క్రితం విబేధాలు ఏర్పడ్డాయి. దీంతో భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇళ్లలో పాచి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. తనకు దూరపు చుట్టమైన పాన్ వ్యాపారి అంబర్ పేట్ కు చెందిన షరీఫ్ యూసుఫ్ (45 ) 2017 లో వివాహం చేసుకుంది. ఇది వరకే అతనికి వివాహమై మెదటి భార్య పిల్లలతో కలిసి నివాసిస్తున్నాడు. అపుడప్పుడు గౌస్ నగర్ లో నివాసముండే రెండవ భార్య దగ్గరికి వచ్చి వెళ్తుండేవాడు. అప్పటికే రెండవ భార్య కూతురు 11 ఏళ్ళ మైనర్ బాలికపై కన్ను పడింది. భార్య పనులకు వెళ్ళగానే గత మూడేళ్ళుగా రెండవ భార్య కూతురిపై బెదిరిస్తూ అత్యాచారం చేస్తున్నాడు. ఎవరికైనా చెబితే నిన్ను మీ అమ్మను చంపేస్తానని బెదిరించి అత్యాచారం చేయసాగాడు. మంగళవారం మరో మారు కూతురిపై అత్యాచారం చేస్తుండగా తల్లి గమనించింది. వెంటనే బాధితురాలి తల్లి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు షరీఫ్ యూసుఫ్ ను అదుపులోకి తీకుని రిమాండ్ కు తరలించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..