నోటాకు మెజారిటీ వస్తే?.. ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

by Dishanational6 |
నోటాకు మెజారిటీ వస్తే?.. ఈసీని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే పరిస్థితి ఏంటని ఈసీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై ఈసీకి నోటీసులు జారీ చేసింది. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం రిజల్ట్ రద్దు చేసి కొత్తగా పోలింగ్ చేపట్టాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. శివ్ ఖేరా అనే రచయిత ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. ఆ పిల్ లో లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది.

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను మరో ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా రూల్స్ రూపొందించాలని అభ్యర్థనలో పేర్కొన్నారు. ఈ అంశాలకు సంబంధించి తగిన నిబంధనలను రూపొందించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిల్ లో పేర్కొన్నారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. ఇటీవల సూరత్‌లో పోలింగ్‌ జరగకుండానే ఓ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైన తీరును ఉదహరించారు. ఒకే అభ్యర్థి ఉన్నందున ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు.

సూరత్ నుండి ఇటీవల ఒక ఉదాహరణను ఉదహరించారు, ఇక్కడ ఒకే అభ్యర్థి మాత్రమే ఉన్నందున ఎన్నికలు నిర్వహించబడలేదు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న సుప్రీం ధర్మాసనం.. ఈసీకి నోటీసులిచ్చింది. ఇది కూడా ఎన్నికల ప్రక్రియలో భాగమేనని, ఈసీ సమాధానం కోసం చూస్తామని పేర్కొంది.

పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ వేసిన పిల్ తో 2013లో సుప్రీం కోర్టుఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంలలో నోటా ఆప్షన్ కల్పించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే నోటీ ను ఎన్నుకోవచ్చు. అయితే, ప్రస్తుత రూల్స్ ప్రకారం నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ అభ్యర్థులపై ఎలాంటి చర్యలు ఉండవు. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. అందుకే నోటాకు మెజారిటీ వస్తే పరిస్థితి ఏంటని ఈసీని ప్రశ్నించింది సుప్రీంకోర్టు.



Next Story

Most Viewed