సిల్వర్ స్క్రీన్‌పై ‘రామసేతు’ హిస్టరీ.. శ్రీలంకను కాదని ‘డామన్‌’కు లొకేషన్ షిఫ్ట్..!

by  |
సిల్వర్ స్క్రీన్‌పై ‘రామసేతు’ హిస్టరీ.. శ్రీలంకను కాదని ‘డామన్‌’కు లొకేషన్ షిఫ్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇండియా, శ్రీలంకను కలుపుతూ సముద్రంలో నిర్మితమైన స్టోన్ బ్రిడ్జి (రామసేతు) హిస్టరీ బేస్డ్ నేపథ్యంలో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఊటీలో కొన్ని కీలక సీన్లకు సంబంధించిన షెడ్యూల్‌ను పూర్తి చేశారు. రీమెనింగ్ పార్ట్ శ్రీలంకలో చిత్రీకరించాల్సి ఉంది. కానీ అనుకోకుండా మిగతా షెడ్యూల్‌ను కేంద్రపాలిత ప్రాంతం ‘డామన్‌ అండ్ డియూ’లో షూటింగ్ చేయాలని మూవీ యూనిట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం శ్రీలంకలో కొవిడ్ మహమ్మారి ఇంకా వ్యాప్తి దశలోనే ఉందని, ఈ కారణం చేత ‘డామన్‌’‌కు లొకేషన్ షిఫ్ట్ చేసినట్టు సమాచారం. రామసేతు మూవీని ‘అభిషేక్ శర్మ’ డైరెక్ట్ చేస్తుండగా, ‘లైకా’ ప్రొడక్షన్స్, ‘కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్’ బ్యానర్ పై ‘అరుణ బాటియా, విక్రమ్ మల్హోత్రా’ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో అక్షయ్‌కు జోడిగా శ్రీలంకన్ బ్యూటీ ‘జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుశ్రత్ బరుచా’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2022 దీపావళికి నాటికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

ఇకపోతే ఈ ‘రామసేతు’ స్టోన్ బ్రిడ్జి తమిళనాడులోని రామేశ్వరం నుంచి సముద్ర మార్గం గుండా శ్రీలంకను కలుపుతుంది. 7th సెంచురీలో లార్డ్ రామ అండ్ వానర సైన్యం ‘సీత’ను రక్షించేందుకు ఈ బ్రిడ్జి నిర్మించినట్టు వాల్మీకి రచించిన ఎపిక్ రామాయణంలో ఉంది. తేలియాడే బండ రాళ్లతో 30 కిలో మీటర్ల మేర ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. రాముడు నిజంగానే ఉన్నాడని, రామాయణం నిజమేనని భారతీయులు ప్రగాఢంగా నమ్ముతుంటారు. కానీ సైన్స్‌ను నమ్మేవారు దీనిని ఖండిస్తుంటారు. ఏదేమైనా ఈ చిత్రం విడుదలయ్యాక ‘రామసేతు’ నిర్మాణం వాస్తవమా? కల్పితమా..? అనే దానిపై ఓ క్లారిటీ రానుంది.


Next Story