ప్రమాదంలో మరో జిల్లా.. అక్కడ ఇప్పటికే..

by  |
ప్రమాదంలో మరో జిల్లా.. అక్కడ ఇప్పటికే..
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : అప్పుడెప్పుడో చెన్నై నగరం వరద నీటితో మునిగింది. తాజాగా చారిత్రక ఓరుగల్లు నగరం మొత్తం జలమయమైంది. గొలుసు కట్టు చెరువుల కందకాలు మాయం కావడం, పెద్ద నాళాలు కబ్జాకు గురికావడం, ఆయా ప్రదేశాల్లో అక్రమంగా పెద్దపెద్ద భవంతులను కట్టడాన్ని చూస్తే ఏదో ఒక రోజు నిర్మల్ పట్టణం మునగక తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యంత్రాంగం ముందే మేల్కొనాలని, సర్వేల పేరిట కాలయాపన చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. తక్షణమే స్పందించి ఆక్రమణలను తొలగించకపోతే భారీ నష్టం వాటిళ్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చారిత్రక చెరువులన్నీ కబ్జామయం

సామంతరాజుల కేంద్రంగా విలసిల్లిన నిర్మల్ పట్టణాన్ని 16వ శతాబ్దంలో నిమ్మనాయుడు పాలించాడు. ఇది గొలుసు కట్టు చెరువులకు ప్రతీతి. నిర్మల్ చుట్టూ 13 భారీ చెరువులు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుతూ కాలువలు ఉండేవి. అందులో ఏ ఒక్క చెరువు నిండినా వాటి ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ప్రవహించేలా ఆ కాలంలోనే డిజైన్ చేశారు. దీంతో నిర్మల్ జిల్లా కేంద్రం లో ఇన్ని దశాబ్దాల కాలంలో ఏ ఒక్కసారి కూడా నీటి ఎద్దడి తలెత్తలేదు. అయితే రాను రాను జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న చెరువులు క్రమంగా ఆక్రమణకు గురవుతూ వచ్చాయి. సగానికిపైగా చెరు వులు కబ్జా కోరల్లో చిక్కి అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అలాగే సామంత రాజులు నిర్మించుకున్న కోట బురుజుల చుట్టూ భారీ కందకాలు ఉండగా అవి కూడా కబ్జాకు గురయ్యాయి. అక్రమణలపై అనేకసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లినా చర్యలు అంతంత మాత్రమే. కొన్ని కేసులు కోర్టుల దాకా వెళ్లాయి. అయినప్పటికీ ఆక్రమణల విషయంలో యంత్రాంగం పూర్తిస్థాయి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలూ ఉన్నాయి.

కందకాల ఆక్రమణలతో ముంపు ప్రమాదం

నిర్మల్ చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువులను కలుపుతూ నిర్మించి న కాలువలు, కందకాలు దాదాపుగా ఆక్రమణలకు గురయ్యాయి. ముఖ్యంగా పట్టణంలో ఉన్న కందకాలు పూర్తిగా కబ్జాకు గురై వాటిపై పెద్దమొత్తంలో గృహ నిర్మాణాలు, వ్యాపార సముదాయా లు వెలిశాయి. అనేక చోట్ల కందకాల ఆనవాళ్లు కూడా లేకుండా పోయాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా నగర్, ప్రియదర్శిని నగర్, భాగ్యనగర్, శాస్త్రినగర్, గొల్లపేట్, బంగ్లాదేశ్, గాంధీచౌక్, సోమార్ పేట్, ద్యాగవాడ, జోహార్ నగర్, కళానగర్, కురాన్ పేట్, కొత్తబస్టాండ్, గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న కందకాలు మాయం అయ్యాయి. పెద్దల అండతో అనేకం ఆక్రమణకు గురై భారీ షాపింగులు నిర్మాణంలోకి వచ్చాయి. కొన్ని పాత కాలనీల్లో ఇష్టమొచ్చినట్లుగా ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కందకాల పైనే అడ్డంగా నిర్మాణాలు వెలిసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అనేక కందకాలకు అక్రమ పట్టాలు సృష్టించి స్వాధీనం చేసుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.

ఆక్రమణలపై చర్యలు ఏవి..?

జిల్లా కేంద్రంలో కందకాలు, కాలువల ఆక్రమణలపై అధికారులు ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గతంలో కోర్టు ఆదేశాల మేరకు కొన్ని చోట్ల సర్వేలు చేసిన అధికారులు తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు. కొంతమంది రెవె న్యూ, పురపాలక శాఖ అధికారులు కబ్జా రాయుళ్లతో కుమ్మ క్కై ఆక్రమణలను ప్రోత్సహించినట్లు ఆరోపణలు కూడా ఉన్నా యి. మీడియాలో ఆ విషయం వస్తే రెవెన్యూ, మున్సిపల్ శాఖ లకు పండగే అన్న ఫిర్యాదులూ ఉన్నాయి. పేపర్లలో ‘మీ ఆక్రమణల గురించి వచ్చింది’… అంటూ నోటీసులు ఇవ్వడం, వారి నుంచి దండుకోవడం పరిపాటిగా మా రిందన్న విమర్శ లు సైతం ఉన్నాయి. అనేకసార్లు సర్వేలు నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. సమస్య జఠిలమైన సందర్భంలో ఈ రెండు శాఖలు ఒకరిపై ఒకరు నెట్టుకోవడం తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

వానొస్తే రోడ్లపైకి నీళ్లు..!

పట్టణంలోని అన్ని కాలనీల్లో కందకాలు, కాలువలు ఆక్రమణకు గురి కావడంతో చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి నీళ్లు వస్తున్నాయి. మురికి కాలువలు సైతం మూసుకుపోవడం, కందకాలు, కాలు వలు చిన్నవిగా మారిపోవడంతో వర్షం నీరు వెళ్లక రోడ్లపైకి వస్తు న్నాయి. అతి భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి ఆక్రమణకు గురైన కాలువలు, కందకాలను పరిరక్షిస్తే మంచిదని, లే దంటే ఎప్పుడో ఒకరోజు మనకు వరద ముంపు.. ముప్పూ తప్పదని నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed