ఏపీలో మూడ్రోజుల పాటు వర్షాలు

by  |
rains
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, రాగల 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశముందన్నారు. వీటి ప్రభావంతో రాగల మూడు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నేడు ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందంది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.


Next Story

Most Viewed