‘చేసిన పనినే చేస్తూ మంచి ఫలితాలు ఆశించడం వెర్రితనమే’

by Shamantha N |

<p>న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై విమర్శలు సంధించారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన నాలుగు గ్రాఫ్‌లు ట్వీట్ చేస్తూ కేసులు ఉధృతిని వివరించారు. చేసిన పనినే చేస్తూ మెరుగైన ఫలితాలు రావాలని ఆశించడం వెర్రితనమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన ట్వీట్ చేసిన గ్రాఫ్‌లు లాక్‌డౌన్ కాలంలో కేసులు ఎలా పెరిగాయో వెల్లడిస్తున్నాయి. 75 రోజుల కాలంలో కేసులు పెరిగిన తీరును వివరించాయి. నిరాఘాటంగా పెరుగుతూ వచ్చిన కేసులను పేర్కొంటూ చేసిన పనినే మళ్లీ చేసి భిన్న [&hellip;]</p>

‘చేసిన పనినే చేస్తూ మంచి ఫలితాలు ఆశించడం వెర్రితనమే’
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రప్రభుత్వంపై విమర్శలు సంధించారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన నాలుగు గ్రాఫ్‌లు ట్వీట్ చేస్తూ కేసులు ఉధృతిని వివరించారు. చేసిన పనినే చేస్తూ మెరుగైన ఫలితాలు రావాలని ఆశించడం వెర్రితనమే అవుతుందని వ్యాఖ్యానించారు.

ఆయన ట్వీట్ చేసిన గ్రాఫ్‌లు లాక్‌డౌన్ కాలంలో కేసులు ఎలా పెరిగాయో వెల్లడిస్తున్నాయి. 75 రోజుల కాలంలో కేసులు పెరిగిన తీరును వివరించాయి. నిరాఘాటంగా పెరుగుతూ వచ్చిన కేసులను పేర్కొంటూ చేసిన పనినే మళ్లీ చేసి భిన్న ఫలితాలు వస్తాయని ఆశించడం పిచ్చితనమే అవుతుందని ట్వీట్ చేశారు.

Next Story