సత్తుపల్లి బీసీ సంఘం ఆఫీసులో ఆర్ నారాయణమూర్తి సందడి..

43

దిశ, కల్లూరు(సత్తుపల్లి) : ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయాన్ని గురువారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సందర్శించారు. వీరిలో హైదరాబాద్‌కు నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు MS వాసు, టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్, ప్రముఖ సినీ నటులు ఆర్. నారాయణ మూర్తి, విడి విడిగా వచ్చి సంఘం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆ సంఘం ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణవరపు శ్రీనివాస్‌తో  కొద్దిసేపు ముచ్చటించారు.

కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దుస్స వెంకటేశ్వర్లు, రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలగారపు అప్పారావు, బీసీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లెలు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి కొక్కొండ రాంబాబు, సత్తుపల్లి టౌన్ అధ్యక్షులు విరివాడ నాగభూషణం, సత్తుపల్లి సొసైటీ మెంబర్ కోట సత్యనారాయణ, సీపీఐ(ఎం) పార్టీ నాయకులు పాండు, cpi ml పార్టీ నాయకులు రాము, బీసీ యూత్ నాయకులు మరేశ్వర రావు, ఆర్ వెంకటేశ్వరరావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..