స్విస్ ఓపెన్ 2వ రౌండ్‌కు పీవీ సింధు

78

దిశ, స్పో:ర్ట్స్:  స్విస్ ఓపెన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో టర్కీకి చెందిన నిస్లియన్ ఈట్‌తో తలపడింది. ఇద్దరి మధ్య హోరాహోరీగా మ్యాచ్ నడిచింది. తొలి గేమ్‌ను పీవీ సిందు 21-16తో కొంచెం తేలికగానే గెలుచుకుంది. కానీ రెండవ గేమ్‌లో ఈట్ పుంజుకొని పీవీ సింధును ఇబ్బంది పెట్టింది. ఇద్దరూ సమానంగా పాయింట్లు గెలుచుకుంటూ వచ్చారు. చివరకు సింధు స్మాష్, డ్రాపింగ్ షాట్లతో ముందంజ వేసింది. రెండో గేమ్‌ను సింధు 21-19 తేడాతో గెలిచింది. వరుసగా రెండు గేమ్స్ గెలిచిన పీవీ సింధు రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో భారత జోడి అశ్విని పొన్నప్ప, సిక్కిరెడ్డి తొలి రౌండ్‌లో జాగెర్, కుస్పర్ట్ జోడీపై 21-5, 21-19 తేడాతో ఓడించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..