‘పీఎం, సీఎం’లకు పూరి విజ్ఞప్తి!

by  |
‘పీఎం, సీఎం’లకు పూరి విజ్ఞప్తి!
X

దిశ, వెబ్‌డెస్క్ :

‘మనమే రైతులా మారిపోవాలి.. మన కిచెన్ పక్కనే కూరగాయలు పెరగాలి.. ప్రతీ ఇంట్లో రైతు పుట్టాల్సిన టైమ్ దగ్గర పడింది.. ఇంటింటా వ్యవసాయం రావాలి.. ఎవరి కూరగాయలు వాళ్లే పండించుకోవాలి’ అంటున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్. వర్టికల్ ఫామింగ్ గురించి వివరించిన ఆయన.. ఇది జరగాలంటే ప్రభుత్వం అవగాహన కల్పించాలని కోరారు. ఎంత మోటివేట్ చేసినా ఒక రైతు ఇలాంటి వ్యవసాయం మొదలు పెట్టలేడని.. వర్టికల్ ఫామింగ్ కిట్లు కొనే స్థోమత కూడా వాళ్ల దగ్గర ఉండదని అన్నాడు.

వ్యవసాయం చేయలేక ఏ రైతు కూడా తన కొడుకుని మళ్లీ రైతుని చేయాలని కోరుకోవడం లేదని.. ప్రభుత్వమే గ్రామాల్లో పెద్ద పెద్ద షెడ్లు వేసి ఈ వర్టికల్ ఫామింగ్ చేయించాలని కోరాడు. ఇది ఇప్పుడు మొదలు పెడితేనే 25 ఏళ్ల తర్వాత మన పిల్లలకు ఆహారం అందుతుందని.. లేదంటే దొరకదని హెచ్చరించాడు. భవిష్యత్తులో 70 శాతం వ్యవసాయం పెరగాలంటే ఇదే మంచి మార్గమని.. ఈ పద్ధతి వల్ల చాలా మంది రైతులకు ఉపాధి కూడా దొరుకుతుందని అన్నారు.

ఇది తన అభ్యర్థన అని.. దయచేసి దీన్ని పరిశీలించి ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నించాలని ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశాడు పూరి.

https://twitter.com/purijagan/status/1315983311148249094?s=19


Next Story

Most Viewed