ఢిల్లీ సరిహద్దులో పంజాబ్ రైతు సూసైడ్

58

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సింఘు సరిహద్దులో నిరసనల్లో పాల్గొన్న 40ఏళ్ల రైతు అమరీందర్‌ సింగ్ శనివారం రాత్రి 7.30గంటలకు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. మృతుని స్వస్థలం పంజాబ్‌లోని సాహిబ్ జిల్లాగా గుర్తించారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల రైతులతో పాటు ఎక్కువగా పంజాబ్, హర్యానా నుంచి సరిహద్దుల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.