ఆ సమయంలో అలాగే ఆడాలి : పుజార

by  |
ఆ సమయంలో అలాగే ఆడాలి : పుజార
X

దిశ, స్పోర్ట్స్ : ‘ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో నా గణాంకాలు చూస్తే సాధారణంగానే ఉంటాయి. భారీ స్కోర్లు లేవు. స్ట్రైక్ రేటు దారుణంగా ఉంటుంది. అయితే ఆ సమయంలో ఎన్ని ఎక్కువ బంతులు ఆడామనేదే ముఖ్యం. అప్పటి పరిస్థితులకు తగినట్లే నేను ఆడాను’ అని టీమ్ ఇండియా నయావాల్ చతేశ్వర్ పుజారా చెప్పాడు. ఆసీస్ పర్యటనలో బంతులు వృథా చేశాడని తొలుత క్రీడాభిమానులు అతడిపై విమర్శలు గుప్పించారు. కానీ పుజారా క్రీజులో పాతుకొని పోవడం వల్లే టీమ్ ఇండియా రెండు మ్యాచ్‌లు గెలిచి, ఒకదాన్ని డ్రా చేసుకోగలిగింది.

ఈ విషయంపై తాజాగా మాట్లాడిన పుజారా.. తాను స్ట్రైక్ రేటును పరిగణలోకి తీసుకోలేదని చెప్పాడు. జట్టు యాజమాన్యం కూడా ఆ సమయంలో అలాగే ఆడమని చెప్పిందని వెల్లడించాడు. కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ విక్రమ్, కెప్టెన్ అజింక్య రహానేలు ఆటను అలాగే కొనసాగించమన్నారని చెప్పాడు. నేను ఎక్కువ సేపు క్రీజులో ఉంటే ఆసీస్ బౌలర్లు తప్పకుండా సహనం కోల్పోతారనే విషయం తనకు తెలుసని పుజారా చెప్పాడు. ఇక రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ చాలా కీలకమైనదని అన్నాడు. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌ల బౌలింగ్ ఎదుర్కోవడం కష్టమే. అయితే వారిని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటికే వ్యూహం సిద్దం చేసుకున్నట్లు పుజారా చెప్పాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నైలో తొలి టెస్టు ప్రారంభం కానుండగా పుజారా చేపాక్ స్టేడియంలో సాధన చేస్తున్నాడు.



Next Story