PSLV C-50 రాకెట్ ప్రయోగం విజయవంతం

by  |
PSLV C-50 రాకెట్ ప్రయోగం విజయవంతం
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరికోటలో పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం అయింది. సీఎంఎస్ -01 శాటిలైట్‌ను రాకెట్‌ నింగిలోకి విజయవంతంగా తీసుకెళ్లింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో ఈ ఉపగ్రహాన్ని రూపొందించింది. 7 ఏండ్ల పాటు సీఎంఎస్-01 శాటిలైట్ సేవలు అందించనుంది. సమాచార వ్యవస్థ కోసం సీఎంఎస్ -01 ఉపగ్రహాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేశారు. అంతేకాకుండా, సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడుతుంది. పీఎస్‌ఎల్వీ సిరీస్‌లో ఇస్రో రూపొందించిన 50వ రాకెట్ ఇదే. అలాగే, ఇస్రో చరిత్రలో 42వ సమాచార ఉపగ్రహం సీఎంఎస్-01. దీని బరువు 1410 కిలోలు ఉండగా..జీవిత కాలం ఏడేళ్లుగా తయారుచేశారు. ఈ ఉపగ్రహంతో ముఖ్యంగా భారత్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ దీవుల్లో సమాచార వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడనుంది.

Next Story