ఇక స్టాకర్ల భయం అవసరం లేదు!

by  |
ఇక స్టాకర్ల భయం అవసరం లేదు!
X

ఏదన్నా పార్టీలో లేదా పండగలో అమ్మాయినో లేక డబ్బున్న వ్యక్తులనో చూడగానే అగంతకుడు వారి వివరాలను తెలుసుకోవడానికి ముందుగా వెతికే చోటు సోషల్ మీడియా. అయితే ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో ఖాతాను ప్రైవేట్‌గా పెట్టుకునే అవకాశం ఉంది. కానీ ఫేస్‌బుక్‌లో ప్రైవేట్ చేసుకునే ఆప్షన్ ఉన్నప్పటికీ అంత ప్రభావవంతంగా ఉండదు. అయితే ఆ అగంతకుడు తెలిసిన వాడే అయితే? ఈ సమస్య నుంచి బయటపడేయడానికి ఫేస్‌బుక్ కొత్త ఫీచర్‌ని తీసుకొచ్చింది.

ఆ ఫీచర్ ద్వారా ఇతరుల నుంచి ప్రొఫైల్‌ని పూర్తిగా లాక్ చేసుకోవచ్చు. దీంతో ముఖ్యంగా మహిళలకు తమ ప్రొఫైల్‌ను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకువచ్చే అవకాశం కలుగుతుంది. ఇప్పటికే ప్రొఫైల్
పిక్‌కి మాత్రమే లాకింగ్ సదుపాయాన్ని కల్పించిన ఫేస్‌బుక్ అదే ఫీచర్‌ని పూర్తి ప్రొఫైల్‌కి అనుసరింపజేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి భారతీయ యూజర్లకు మాత్రమే ఈ సదుపాయం
అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా స్టాకర్లు ఫొటోలను జూమ్ చేయలేరు, డౌన్‌లోడ్ చేయలేరు, ఫుల్ సైజులో చూడలేరు. అంతేకాకుండా వారు పోస్టులను, ఫొటోలను చూడకుండా కూడా నియంత్రించవచ్చు. అంతేకాకుండా ప్రొఫైల్ లాక్ పెట్టుకున్నపుడు మీరు పబ్లిక్ పోస్టింగులు చేయలేరు. అప్‌డేట్ నెమ్మదిగా రోల్ చేస్తున్న కారణంగా కొందరికి అందుబాటులోకి రాకపోవచ్చు.

Next Story

Most Viewed