ప్రభుత్వ కార్యాలయమే ఇల్లు.. అక్కడే కారు పార్కింగ్

by  |
ప్రభుత్వ కార్యాలయమే ఇల్లు.. అక్కడే కారు పార్కింగ్
X

దిశ ప్రతినిధి, మెదక్: సిద్దిపేట పట్టణం వినగానే మొదట గుర్తొచ్చేది మున్సిపల్ కార్యాలయం. పట్టణంలోని ఏ వ్యక్తికి పనిపడ్డ మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిందే. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇంటి పన్ను, ఇతర వార్డు సమస్యల కోసం నిత్యం వందల సంఖ్యలో మున్సిపల్ ఆఫీసుకి వస్తుంటారు. వారందరికీ వాహన పార్కింగ్ కోసం కొంత స్థలం కేటాయించారు. పెరిగిన రద్దీ దృష్ట్యా మున్సిపల్ కార్యాలయంలో వాహనాల పార్కింగ్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఆ విషయం తెలిసిన మున్సిపల్ మెప్మా విభాగంలో పని చేస్తున్న ఒక అధికారి తన కారుని ఇంటి వద్ద కాకుండా మున్సిపల్ పార్కింగ్ ఆవరణలోనే పార్కింగ్ చేస్తున్నాడు.

దీంతో మున్సిపల్ కార్యాలయంకి వచ్చే వారికి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఒక్క రోజు.. రెండు రోజులు కాదు.. గత కొన్ని నెలలుగా మెప్మా అధికారి తన కారును మున్సిపల్ కార్యాలయంలోనే పార్కింగ్ చేస్తున్నాడని పలువురు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఓ ప్రభుత్వ అధికారి ఇలా చేస్తే ఎలా? అని ముచ్చటించుకుంటున్నారు.

దిశ ఎఫెక్ట్.. స్పందించిన సిద్దిపేట మున్సిపల్ కమిషనర్.. Click Below Link

https://www.dishadaily.com/disha-effect-responding-municipal-commissioner


Next Story

Most Viewed