పృథ్వీ షాను అడ్డుకున్న పోలీసులు.. గంటలోనే అలా..

67

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా బ్యాట్స్‌మెన్ పృథ్వీ షాను మహారాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. మహారాష్ట్ర నుంచి కారులో పృథ్వీ షా గోవా వెళ్లాల్సి ఉంది. కానీ మహారాష్ట్రలో లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఎక్కడికి వెళ్లాలన్నా.. ప్రభుత్వం ఈ పాస్ తప్పనిసరి చేసింది. కానీ పృథ్వీషా దగ్గర ఈ పాస్ లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ పాస్ లేకుండా గోవా వెళ్లడం కుదరదని తెగేసి చెప్పారు.

దీంతో పృథ్వీషా చేసేదేమీ లేక ఫోన్‌లోనే అప్పటికప్పుడు ఈ-పాస్‌కు అప్లై చేసుకున్నాడు. గంట తర్వాత అనుమతి రావడంతో పోలీసులకు పాస్ చూపించి వెళ్లిపోయాడు.

.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..